ఖరీదైన కారులో తరలిస్తున్న గుట్కా పట్టివేత

ఖరీదైన కారులో తరలిస్తున్న గుట్కా పట్టివేతహనుమకొండ జిల్లా : ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఖరీదైన కారులో తరలిస్తున్న నిషేధిత గుట్కా బ్యాగులు హనుమకొండ పోలీసు కంటపడ్డాయి. దీంతో కారులో వున్న గుట్కా బ్యాగులను, వాటిని తరలిస్తున్న వ్యక్తితో పాటు కారు డ్రైవర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలను వెల్లడించారు.

హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన రాజ్ పురోహిత్ మహేందర్ బీదర్ నుండి ఖరీదైన కారులో గుట్కా బ్యాగులను తరలిస్తున్నట్లుగా టాస్క్ పోలీసులకు సమాచారం అందినట్లు అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం రఘునాథ్ పల్లి టోల్ గెట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడి కారు తనీఖీ చేశారు. దీంతో కారులో 10 గుట్కా బ్యాగులను గుర్తించి గుట్కాఅక్రమ రవాణా కు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడితో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గుట్కా బ్యాగులు, కారును తదుపరి విచారణ నిమిత్తం రఘునాథ్ పల్లి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్ తో పాటు ఇతర టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అదనపు డీసీపీ అభినందించారు.