ఆ జిల్లాకు శుభవార్త..రేపు అసెంబ్లీలో ప్రకటన..!

ఆ జిల్లాకు శుభవార్త..రేపు అసెంబ్లీలో ప్రకటన..!

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లాను అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అనే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పి 24 గం.లు గడవక ముందే సీఎం కేసీఆర్ ములుగు జిల్లాకు వరాల జల్లు కురిపించనున్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ చేసిన అభ్యర్ధన మేరకు సీఎం కేసీఆర్ ములుగు పై అమితమైన ప్రేమను చాటుతూ మెడికల్ కాలేజ్ మంజూరు చేసి వరాల జల్లు కురిపించనున్నారు.ఆ జిల్లాకు శుభవార్త..రేపు అసెంబ్లీలో ప్రకటన..!రేపు  అసెంబ్లీలో స్వయంగా ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ తెలిపారు. కావున గులాబీ శ్రేణులు రేపు ఉదయం ప్రకటన విడుదల అయిన తర్వాత సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతతో వారి చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టాలని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ పిలుపునిచ్చారు.