ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరిక

ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరిక

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 3వ రౌండ్ శాంతి చర్చల్లో ‘నిర్మాణాత్మక’ విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్ కు సూచించారు. టర్కీ ప్రధాని తయ్యిప్ ఎర్డోగాన్ తో ఆదివారం ఫోన్ లో మాట్లాడిన పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్ పై రష్యా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. అనుకున్నట్లుగానే తమ లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు.ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరికఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుమారు 1 గంటా 45 నిమిషాల పాటు రష్యా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తీరుపై పుతిన్ మండిపడ్డారు. రష్యా దళాలు చుట్టుముట్టిన పోర్టు నగరమైన పోల్ లో కాల్పులు విరమించినప్పటికీ పౌరులను తరలించడంలో ఉక్రెయిన్ విఫలమైందని విమర్శించారు. విదేశీలను బంధీలుగా చేసుకునేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయిన్ ఇలా వ్యవహరించిందని పుతిన్ ఆరోపించారు.