జంట నగరాల్లో దంచికొట్టిన వర్షం 

జంట నగరాల్లో దంచికొట్టిన వర్షం

warangaltimes, హైదరాబాద్ : హైదరాబాద్‌-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో వర్షం దంచికొడుతోంది. పలు చోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట, నిజాంపేట, మియాపూర్‌లో వడగళ్ల వాన పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, మణికొండ, ఫిల్మ్‌నగర్‌, షేక్‌పేట్‌, నార్సింగ్‌, టోలీచౌక్‌లో ఆగకుండా వర్షం కురుస్తోంది.

బోయిన్ పల్లి, మారేడు పల్లి, చిలుకల గూడ, బేగంపేట, అల్వాల్, తిరుమల గిరి, కూకట్ పల్లి, హైదర్ నగర్, జీడిమెట్ల బాచుపల్లి, ఈసీఐఎల్, కాప్రా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది.