రష్యాపై వీసా, మాస్టర్ కార్డ్ సేవలు నిలిపివేత

రష్యాపై వీసా, మాస్టర్ కార్డ్ సేవలు నిలిపివేత

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై యుద్దానికి దిగిన రష్యాపై ఇంటర్నేషనల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్ ఆంక్షలు విధించాయి. రష్యాలో తమ సంస్థల కార్యకలాపాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇంతకు ముందు రష్యాలో తమ కార్యకలాపాలను టెక్ జెయింట్స్ మైక్రోసాఫ్ట్ , ఆపిల్ నిలిపేసిన సంగతి తెలిసిందే. వీసా ఇంక్ చైర్మన్ కం సీఈవో ఆల్ కెల్లీ స్పందిస్తూ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకున్నా ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు దిగిందని ఆరోపించారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.రష్యాపై వీసా, మాస్టర్ కార్డ్ సేవలు నిలిపివేతరష్యాలో కార్యకలాపాలను సస్పెండ్ చేయడం వల్ల తమ సహచర సిబ్బందికి, క్లయింట్లకు, పార్టనర్లు, మర్చంట్లకు, కార్డు హోల్డర్లకు తలెత్తే ఇబ్బందుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. రష్యా చర్య శాంతి, సుస్థిరతకు ముప్పుగా పరిణమించిందన్నారు. ఉద్యోగులు, వినియోగదారులు, ఇండస్ట్రీలోని వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత రష్యాలో కార్యకలాపాలు నిలిపేయాలని నిర్ణయించామని మాస్టర్ కార్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ సేవలను కొనసాగించాలనే తాము భావించామని, కానీ ప్రస్తుత సంక్షోభంతో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకుల నేపథ్యంలో రష్యాలో నెట్ వర్క్ సేవలు సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.