సత్తాచాటిన సిక్కోలు కుర్రాడు
వరంగల్ టైమ్స్ , శ్రీకాకుళం జిల్లా : టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ, కోమల దంపతుల కుమారుడు శ్రీశైలేష్ ఐఇఎస్(ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్)కు ఎంపికయ్యాడు. యూపీఎస్‌సీ-2021లో వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల్లో ఆల్ ఇండియాలో 8వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి వెంకటరమణ విశాఖలోని నేవల్ డాక్ యార్డు షిప్ బిల్లిండ్ సెంటర్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నారు.తల్లి కోమల విశాఖలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ రీత్యా వీరు విశాఖలో స్థిరపడ్డారు. శ్రీశైలేష్ ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం విశాఖలో పూర్తిచేశాడు. కేరళలో ఎస్‌టి (నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో 2014-2017 విద్యా సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఐదు రోజుల క్రితం యుపిఎస్‌సి విడుదల చేసిన ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి ఐఇఎస్‌కు ఎంపికయ్యాడు. టెక్కలికి చెందిన శ్రీశైలేష్‌ను పలువురు అభినందించారు.