‘యువశక్తి’ సభలో గాయపడ్డ కార్యకర్తలు

‘యువశక్తి’ సభలో గాయపడ్డ కార్యకర్తలు

'యువశక్తి' సభలో గాయపడ్డ కార్యకర్తలువరంగల్ టైమ్స్, రణస్థలం : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన చేపట్టిన ‘యువశక్తి’ సభ వద్ద తోపులాట జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ సభావేదిక వద్దకు చేరుకోగానే కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని వచ్చేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఓ కార్యకర్తపై ఎస్సై దాడి చేయడంతో మిగతా కార్యకర్తలు తిరగబడ్డారు. గాయపడ్డ కార్యకర్తకు వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు.