కోడి పందాలకు కోనసీమలో నో ఛాన్స్

కోడి పందాలకు కోనసీమలో నో ఛాన్స్

కోనసీమలో నో కోడిపందాలు
చలో కాకినాడకు అంటున్న జూదగాళ్లు
కోడిపందాలకు సిద్ధమవుతున్న తాళ్లరేవు మండలం నీలంపల్లికోడి పందాలకు కోనసీమలో నో ఛాన్స్వరంగల్ టైమ్స్,కాకినాడ జిల్లా: సంక్రాంతి కోడిపందాల జూదాల నిర్వహణకు భారీ సెట్టింగ్లతో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలంపల్లి వేదిక కానుంది. కోనసీమ జిల్లా ఎస్పీ ఆంక్షలు కఠినతరం చేయడంతో కోడిపందాల జూదాలను కాట్రేనికోన మండల జూదాల వ్యాపారి కాకినాడ జిల్లాకు మార్చాడు. దీంతో జూదాల ఏర్పాట్లు చురుగ్గా సాగడంతో పాటు కోట్ల రూపాయలు చేతులు మార్పిడికి రంగం సిద్ధమైంది. ఈ ఘటనపై జిల్లా పోలీసుల మెతక వైఖరితో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.