హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

వరంగల్ టైమ్స్, విశాఖ జిల్లా : విశాఖ జిల్లా భీమిలీ, వల్లాది పేటలో దారుణం జరిగింది. విహహేతర సంబంధం ఓ హత్య దారితీసింది. ప్రియుడు శ్రీనివాసరావు మోజులో పడిన వివాహిత జ్యోతి, భర్త పైడిరాజును ప్రియుడుతో కలిసి హతమార్చింది. భీమిలీలో హత్యచేసి మృతదేహాన్ని కైలాసగిరి సమీపంలోని స్మశానవాటికలో దహనం చేసినట్లు సమాచారం.

మృతుడు పైడిరాజు అన్నయ్య వంక చిన్నారావు భీమిలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భీమిలీ సీఐ లక్ష్మణ్ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.