దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్ట్

దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్ట్

వరంగల్ టైమ్స్, కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా కైకలూరులో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు యువకుడి వద్ద రూ.1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సింగిడి సత్యనారాయణగా గుర్తించారు.దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్ట్

దొంగతనంలో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కైకలూరు టౌన్ ఎస్సై షణ్ముఖ సాయి వెల్లడించారు.