ఉగ్రవాది హతం..సెర్చింగ్ ఆపరేషన్ కంటిన్యూ

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కుప్వారా జిల్లాలోని జుమాగఢ్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఈ క్రమంలో తమకు తారసపడిన ఉగ్రవాదిని లొంగిపొమ్మని హెచ్చరించారు. కానీ అతను పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే అనుమానంతో పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.