ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా

ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్  : ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్ మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్ ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ అధికారిక నోట్ ను ఆర్ఆర్ఆర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. దీంతో జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదాగతంలో కూడా పలుమార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కారణంగా మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ , వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో ప్రస్తుతం సంక్రాంతి బరిలో కేవలం రాధేశ్యామ్, బంగార్రాజు మాత్రమే ఉండనున్నాయి. వీటితో ఓ తమిళ డబ్బింగ్ సినిమా వాలిమై విడుదల కానుంది. అన్ని కుదిరితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.