బాబు అవసరమైనప్పుడే లవ్ చేస్తాడు : సోము

బాబు అవసరమైనప్పుడే లవ్ చేస్తాడు : సోముఅమరావతి : మొన్నటి దాకా వైసీపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేసిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈసారి మాజీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేశారు. శుక్రవారం నాడు చంద్రబాబుపై సోము వీర్రాజు వ్యంగ్యాస్త్రాలను విసిరాడు. తన అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని, అవసరమైనప్పుడే లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడని విమర్శించారు.

గతంలో కాంగ్రెస్ ను కూడా లవ్ చేశాడని సోము వీర్రాజు ఆరోపించారు. చంద్రబాబు అవసరమైనప్పుడు లవ్ చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో చెప్పనని ఆయన ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు నాయుడు అవకాశవాదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జనసేన బీజేపీ మిత్రపక్షమని పేర్కొన్నారు.

ఇటీవల పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై సోము వీర్రాజు స్పందించారు. ఆ రాష్ట్రంలో ప్రధాని భద్రతకు భంగం వాటిల్లేలా పరిస్థితులు సృష్టించారని అన్నారు. పంజాబ్ వ్యవహారంపై రాష్ట్రంలో నిరసనలు తెలియచేస్తామని తెలిపారు. నేడు సాయంత్రం గవర్నర్ ను కలువనున్నట్లు తెలిపారు.