కెనడాలో ఐదుగురు భారతీయలు దుర్మరణం

కెనడాలో ఐదుగురు భారతీయలు దుర్మరణం

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : కెనడాలోని టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున టొరంటో సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని ప్యాసింజర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్ బైసారియా వెల్లడించారు. బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థుల మృతిపై అజయ్ సంతాపం తెలిపారు.కెనడాలో ఐదుగురు భారతీయలు దుర్మరణం‘కెనడాలో హృదయ విదారక విషాదంపై భారత రాయబారి అజయ్ బైసారియా ట్వీట్ ద్వారా స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. టొరంటోలోని భారత బృందం బాధితుల స్నేహితులతో టచ్ లో ఉంది ‘ అని అజయ్ ట్వీట్ చేశారు. కాగా మృతులను హర్ ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరన్ పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ గా గుర్తించామని క్వింటే వెస్ట్ ఒంటారియో ప్రొవిన్సియల్ పోలీసులు తెలిపారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వ్యాన్ శనివారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ట్రాక్టర్ ట్రైలర్ ను ఢీకొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని , దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.