అందరి అంచనాలు తారుమారయ్యాయి : మోడీ

అందరి అంచనాలు తారుమారయ్యాయి: మోడీ

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేతాలని ఆయన వర్ణించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. యూపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తాజా ఫలితాలతో రుజువైందని పేర్కొన్నారు. బీజేపీ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగిందని చెప్పారు. స్త్రీ శక్తి తమకు అండగా ఉందని కొత్తగా ఓటు హక్కు పొందిన యువత తమకు పట్టం కట్టారని అన్నారు.అందరి అంచనాలు తారుమారయ్యాయి : మోడీరానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ లో తమకు స్థానాలు పెరిగాయని, గోవాలో అందరి అంచనాలు తారుమారాయ్యాయని చెప్పుకొచ్చారు. యూపీలో రెండోసారి పట్టం కట్టి రికార్డు సృష్టించారని అన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ సహా అన్ని ధరలూ మండుతుండగా యుద్ధం కారణంగా ధరలు పెరుగుతున్నాయని ధరల మోతను మోడీ సమర్ధించుకున్నారు.