ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించే వర్సిటీలు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండలి నియమించింది. టీఎస్ ఎంసెట్, టీఎస్ ఈసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్ కు, టీఎస్ ఐసెట్ ను కేయూకి, టీఎస్ పీజీఈసెట్, టీఎస్ ఎడ్ సెట్ , టీఎస్ లాసెట్ , టీఎస్ పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు.

కన్వీనర్ల పేర్లు….
టీఎస్ ఐసెట్ కన్వీనర్ – ప్రొ. కే.రాజిరెడ్డి ( కేయూ )
టీఎస్ ఎంసెట్ కన్వీనర్ – ప్రొ. ఏ.గోవర్ధన్ ( జేఎన్టీయూహెచ్ )
టీఎస్ ఈసెట్ కన్వీనర్ – ప్రొ. కే.విజయ్ కుమార్ రెడ్డి ( జేఎన్టీయూహెచ్ )
టీఎస్ ఎడ్ సెట్ కన్వనీర్ – ప్రొ. ఏ.రామకృష్ణ ( ఓయూ )
టీఎస్ పీజీ ఈసెట్ కన్వీనర్ -ప్రొ. పీ.లక్ష్మీనారాయణ ( ఓయూ రిజిస్ట్రార్ )
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ కన్వీనర్ – ప్రొ. జీబీ రెడ్డి ( పీజీఆర్ఆర్ డైరెక్టర్ )