‘సెట్ ‘ల షెడ్యూల్ విడుదల
warangal times, అమరావతి : అమరావతి రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పీజీ ఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీఈసెట్, పీజీసెట్ షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి గురువారం విడుదల చేసింది. అపరాధ రుసుము లేకుండా, వివిధ అపరాధ రుసుములతో ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు గడువులను ప్రకటించింది. ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది.
* దరఖాస్తు స్వీకరణ ప్రక్రియలు ఇలా ఉన్నాయి..
పీజీఈసెట్ : మార్చి 21
లాసెట్ : మార్చి 23
ఎడ్సెట్ : మార్చి 24
పీఈ సెట్ : మార్చి 23
పీజీసెట్ : ఏప్రిల్ 1 నుంచి ప్రారం భమవుతాయి.
* అపరాధ రుసుములతో ..
పీజీ ఈసెట్ :మే 14 వరకు,
లాసెట్ : మే 6,
ఎడ్ సెట్ : మే 10,
పీఈ సెట్ : మే 24,
పీజీసెట్ : మే 31వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
మే 28 నుంచి 30 వరకు పీజీ ఈసెట్, మే 20న లాసెట్, ఎడ్ సెట్ ,మే 31 నుంచి పీఈసెట్, జూన్ 6 నుంచి 10 వరకు పీజీసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.