క్లాస్ రూంలో ఘర్షణ.. ఆపై ఏం జరిగింది..?

క్లాస్ రూంలో ఘర్షణ.. ఆపై ఏం జరిగింది..?

వరంగల్ టైమ్స్, కృష్ణానగర్‌ : హైదరాబాద్‌ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సాయి కృప స్కూల్ లో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పదో తరగతి చదవుతున్న ఆరుగురు విద్యార్థులు ఓ విద్యార్థిపై దాడి చేశారు. గతంలో క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణతో మరోసారి తరగతి గదిలో ఘర్షణకు దిగారు.
క్లాస్ రూంలో ఘర్షణ.. ఆపై ఏం జరిగింది..? క్లాస్‌రూంలోనే వాటర్ బాటిల్స్ తో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరో తరగతి చదువుతున్న మన్సూర్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.