ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు ఘన స్వాగతం

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు ఘన స్వాగతంవరంగల్​ అర్బన్ ​: గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి బుధవారం వరంగల్​కు వచ్చిన బస్వరాజు సారయ్యకు టీఆర్​ఎస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొదట ఆయన హన్మకొండలోని అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ​ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్,కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కు కృతజ్ఞతలు తెలిపారు. వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వరంగల్​కు ప్రజలకు అండగా నిలుస్తానన్నారు.