విశాఖలో ప్రేమోన్మాది ఘూతుకం

విశాఖలో ప్రేమోన్మాది ఘూతుకం

వరంగల్ టైమ్స్ , విశాఖ : ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారి ఆగడాలు ఆగడంలేదు. తాజాగా బుధవారం విశాఖ వన్​టౌన్​లోని థాంసన్​ స్ట్రీట్​లో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. బాధిత యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖవన్ టౌన్ ఏరియా థాంసన్ స్ట్రీట్‌లో ఉంటున్న ప్రియాంక సచివాలయంలో వలంటీర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అదే స్ట్రీట్​లో ఉండే శ్రీకాంత్​ అనే యువకుడు ఆమెను ప్రేమించానంటూ వేధించేవాడని తెలిపారు.విశాఖలో ప్రేమోన్మాది ఘూతుకంఅలాగే పెళ్లిచేసుకుంటానని కోరడంతో ఆమె ఆంగీకరించలేదు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టకున్న నిందితుడు శ్రీకాంత్​ ప్రియాంక ఇంట్లో ఉన్న సమయంలో ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆయన తనను తానూ గాయపర్చుకున్నాడని పేర్కొన్నారు. రక్తస్రావమైన ఇద్దరిని స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.