శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు 

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 5 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలు భాగంగా నవగ్రహ హోమం ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పుణ్యాహవాచనం, కలశ స్థాపన పూజ, నవగ్రహ ఆవాహనం, అగ్ని ప్రతిష్ట, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటి ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.