శ్రీహరికోటలో మరో విషాదం
వరంగల్ టైమ్స్, అమరావతి : తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. వరుసగా మూడురోజులు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలవరం రేపుతుంది. ఆదివారం రాత్రి రాడార్ సెంటర్ లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన చింతామణి అనే జవాన్ చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూంలో సి-షిఫ్ట్ లో విధుల్లో ఉన్న యూపీకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ తన వద్ద ఉన్న పిస్తోలుతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే వికాస్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక భార్య మంగళవారం రాత్రి నర్మద గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలపై షార్ అధికారులు, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.