‘ఆర్ఆర్ఆర్’ కు సియాటిల్ క్రిటిక్స్ అవార్డు 

‘ఆర్ఆర్ఆర్’ కు సియాటిల్ క్రిటిక్స్ అవార్డు

'ఆర్ఆర్ఆర్' కు సియాటిల్ క్రిటిక్స్ అవార్డు 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఇరగదీస్తోంది. ఆ ఫిల్మ్ వరుసగా అవార్డులను గెలుచుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు సియాటిల్ క్రిటిక్స్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో ఆ అవార్డు దక్కింది. ఈ సంవత్సరానికి సంబంధించిన అవార్డులను జనవరి 17న ప్రకటించారు.

ప్రేమ్ రక్షిత్, దినేష్ క్రిష్ణనన్ లు కొరియోగ్రఫీ చేయగా, విక్కీ అరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలేవ్ లు స్టంట్ కోఆర్టినేటర్లుగా చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్, ఆస్కార్స్ 2023లో మొత్తం 14 కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్నది. అయితే జనవరి 24న ఆస్కార్స్ తది నామినేషన్ల జాబితాను విడుదల చేస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాటకు ఆస్కార్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 550 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ ఫిల్మ్ ను రాజమౌళి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.