ఖమ్మం సభకు వెహికిల్స్ రూట్ మ్యాప్ ఇదే

ఖమ్మం సభకు వెహికిల్స్ రూట్ మ్యాప్ ఇదే

వరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా: బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దారి మళ్లించనున్నారు. సభ నేపథ్యంలో 5 రోజులుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనర్లు ఏవీ రంగనాథ్, విష్ణు ఎస్ వారియర్ లు సమాలోచనలు చేశారు. సభ జరిగే ప్రాంతాలు, ట్రాఫిక్ ఏరియాలు, దారి మళ్లింపులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేసి రూట్ మ్యాప్ ను విడుదల చేశారు.

రాష్ట్రంలోని 31 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పంజాబ్, యూపీ, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రజలు, ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో ఖమ్మం మీదుగా వచ్చీపోయే సాధారణ, భారీ వాహనాల ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.ఖమ్మం సభకు వెహికిల్స్ రూట్ మ్యాప్ ఇదేఖమ్మం సభకు వచ్చే వాహనాలకు రూట్ మ్యాప్ …
*కోదాడ, హుజూర్‌నగర్, నియోజకవర్గాలు,నేలకొండపల్లి మండలం (పాలేరు A/C) ముదిగొండ మండలం (మధిర A/C) చెందిన వాహనాలు, వెంకటగిర్ Xరోడ్, చర్చి కాంపౌండ్, లకారం రోడ్డు , గొల్లగూడెం రోడ్, శబరి వైన్స్ మీదుగా నూతన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్-పార్కింగ్-20లో వాహనాలు పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో పార్కింగ్- 20 నుండి శబరి వైన్స్, గొల్లగూడెం రోడ్, లకారం, చర్చి కాంపౌండ్, వెంకటగిరి ఎక్స్ రోడ్ మీదుగా వెళ్లాలి.

 

*పాలేరు నియోజకవర్గం చెందిన వాహనాలు కోదాడ ఎక్స్ రోడ్, వరంగల్ ఎక్స్ రోడ్, ఏదులాపురం ఎక్స్ రోడ్, ములకలపల్లి ఎక్స్ రోడ్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీ శ్రీ సర్కిల్ మీదుగా పార్కింగ్-పార్కింగ్-4లో వాహనాలు పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో శ్రీ శ్రీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త  బస్టాండ్, ములకలపల్లి Xరోడ్డు,  ఏదులాపురం Xరోడ్డు, డీబీఆర్ సర్కిల్, కోదాడ Xరోడ్డు మీదుగా వెళ్లాలి.

*సూర్యాపేట, నల్గొండ, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన వాహనాలు కోదాడ ఎక్స్ రోడ్, డీబీఆర్ సర్కిల్, ఏదులాపురం ఎక్స్ రోడ్, ములకలపల్లి ఎక్స్ రోడ్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీ శ్రీ సర్కిల్ మీదుగా పార్కింగ్ -పార్కింగ్-3లో వాహనాలు పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో శ్రీ శ్రీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త  బస్టాండ్, ములకలపల్లి Xరోడ్డు,  ఏదులాపురం Xరోడ్డు, డీబీఆర్ సర్కిల్, కోదాడ Xరోడ్డు మీదుగా వెళ్లాలి.

*ఇల్లందు, కారేపల్లి, కామేపల్లి, రఘునాధపాలెం మండలాలకు చెందిన వాహనాలు రఘునాధపాలెం యాపిల్ ఎక్స్ రోడ్, వైఎస్ఆర్ కాలనీ మీదుగాపార్కింగ్- పార్కింగ్-3లో పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలోవైఎస్ఆర్ కాలనీ, రఘునాధపాలెం ఎక్స్ రోడ్డు మీదుగా వెళ్లాలి.

*మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు చెందిన వాహనాలు కొరివి, మారెమ్మ టెంపుల్, ములకలపల్లి Xరోడ్డు, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీ శ్రీసర్కిల్ మీదుగా పార్కింగ్- పార్కింగ్-1లో వాహనాలు పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో శ్రీ శ్రీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త  బస్టాండ్, ములకలపల్లి X రోడ్డు,  మారెమ్మటెంపుల్, కురవి మీదుగా వెళ్లాలి.

*పాలకుర్తి నియోజకవర్గం నుండి వచ్చే వాహనాలు తొర్రూర్, బంగ్లా, ఏదులాపురం ఎక్స్ రోడ్, ములకలపల్లి ఎక్స్ రోడ్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీ శ్రీ సర్కిల్ పార్కింగ్- 1 లో పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో శ్రీ శ్రీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త  బస్టాండ్, ములకలపల్లి Xరోడ్డు, ఏదులాపురం Xరోడ్, బంగ్లా, తొర్రూర్ మీదుగా వెళ్లాలి.

*ఖమ్మం నగరానికి చెందిన నయాబజార్, జెడ్పీ సెంటర్, ఇల్లందు Xరోడ్, రోటరీ నగర్, శ్రీ శ్రీ సర్కిల్ మీదుగా పార్కింగ్- 2లో వాహనాలు పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో శ్రీ శ్రీ సర్కిల్, రోటరీ నగర్, ఇల్లందు Xరోడ్డు,  జెడ్పీ సెంటర్, నయాబజార్ మీదుగా వెళ్లాలి.

*కొత్తగూడెం,భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన వాహనాలు కొత్తగూడెం, తాల్లాడ, వైరా, కొణిజర్ల మీదుగా నూతన కలెక్టరేట్ సమీపంలోని పార్కింగ్ – 7 పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో కొణిజర్ల, వైరా, తాళ్లాడ, కొత్తగూడెం వెళ్లాలి.

*పినపాక నియోజకవర్గం చెందిన వాహనాలు కొత్తగూడెం, తాల్లాడ, వైరా, కొణిజర్ల మీదుగా పార్కింగ్ -11లో పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో కొణిజర్ల, వైరా, తాళ్లాడ, కొత్తగూడెం మీదుగా వెళ్లాలి.

* అశ్వారావుపేట నియోజకవర్గం చెందిన వాహనాలు VM బంజర్, తల్లాడ, వైరా, కొణిజర్ల మీదుగా పార్కింగ్ -11 లో వాహనాలు పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో కొణిజర్ల, వైరా, తల్లాడ మరియు వీఎం బంజర్ మీదుగా వెళ్లాలి.

*సత్తుపల్లి నియోజకవర్గం చెందిన వాహనాలు వీఎం బంజర్, తల్లాడ, వైరా, కొణిజర్ల మీదుగా పార్కింగ్ – 9 లో పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో కొణిజర్ల, వైరా, తల్లాడ, వీఎం బంజర్ మీదుగా వెళ్లాలి.

*మధిర నియోజకవర్గం చెందిన వాహనాలు బోనకల్, చింతకాని, వందనం మీదుగా పార్కింగ్ – 9 లో వాహనాలు పార్కింగ్ చేయాలి.తిరుగు ప్రయాణంలోవందనం, చింతకాని, బోనకల్ మీదుగా వెళ్లాలి.

*వైరా నియోజకవర్గం చెందిన వాహనాలు వైరా, కొణిజర్ల మీదుగా పార్కింగ్ -10లో పార్కింగ్ చేయాలి. తిరుగు ప్రయాణంలో కొణిజర్ల, వైరా మీదుగా వెళ్లాలి.