గాల్లో రెండు హెలికాప్టర్ లు ఢీ

గాల్లో రెండు హెలికాప్టర్ లు ఢీ

గాల్లో రెండు హెలికాప్టర్ లు ఢీ

వరంగల్ టైమ్స్, ఇంటర్నేషనల్ డెస్క్ : ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు టూరిస్ట్ హెటికాప్లర్ లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోల్డ్ కోస్ట్ లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో గల మెయిన్ బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కి తరలించినట్లు చెప్పారు. టూరిస్టులను రైడ్ కు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.