ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం

ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం

వరంగల్ టైమ్స్, ఏపీ : వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న రాజమండ్రి చేరుకున్న సినీ నటి రోజా ఇండిగో విమానం ద్వారా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి పయనమయ్యారు.ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదంఅయితే తిరుపతి సమీపంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేణిగుంటలో ల్యాండ్ కావాల్సిన విమానం దాదాపు గంటసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఎంతకీ క్లియర్ కాకపోవడంతో బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు 70 మంది ప్రయాణికుటున్నారు. పైలట్ సురక్షితంగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ విమానంలో రోజాతో పాటు టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేళ్వరరావు ఉన్నారు. బెంగళూరులో దిగిన ప్రయాణికులు, అక్కడి నుంచి తిరుపతికి పయనమయ్యారు. విమానంలో సాంకేతిక లోపం ఎలా తలెత్తిందనే విషయంపై అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని స్వయంగా సినీ నటి రోజా సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశారు.