శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం  

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం   వరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లల్లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కల్గుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 60,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,291 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.32 కోట్లు వచ్చిందని తెలిపారు.

తిరుపతికి చెందిన కె.శ్రీనివాస్ జగదీష్ చంద్ర అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. 10 లక్షల 1016 విరాళంగా అందించారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ విరాళాన్ని తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈవో సదా భార్గవికి అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.