మళ్లీ హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ  

మళ్లీ హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ

మళ్లీ హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ   వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ లో చేర్పించారు. బ్రాంకైటీస్ వ్యాధికి సోనియా గాంధీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ యేడాది ఆమె హాస్పిటల్ లో చేరడం ఇది రెండవసారి . జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్ ఇన్పెక్షన్ తో ఆమె బాధపడ్డారు.

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. జ్వరం వల్ల సోనియాను హాస్పిటల్ లో చేర్పించినట్లు ట్రస్టు సొసైటీ చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్ అరూప్ బాసు నేతృత్వంలో చికిత్స సాగుతోందన్నారు. ఆమె కండిషన్ ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.