రోజాకు మెగా సాఫ్ట్ కౌంటర్

రోజాకు మెగా సాఫ్ట్ కౌంటర్

రోజాకు మెగా సాఫ్ట్ కౌంటర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మెగా ఫ్యామిలీలపై ఏపీ మంత్రి రోజా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సినిమాల్లో ప్రజల డబ్బుతో మెగా ఫ్యామిలీ ఎంతో ఎత్తుకు ఎదిగిందని, కానీ ప్రజలకు వారు ఒక చిన్న సాయం కూడా చేయలేదని, అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని ఆమె అన్నారు. మెగా బ్రదర్స్ కు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ రోజాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడితేనే వాళ్లకు గుర్తింపు వస్తుందని అన్నారు. అడ్డదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లు తనను, తన ఫ్యామిలీని తిడుతుంటారని చెప్పారు.

ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తనతో స్నేహంగా ఉన్నవాళ్లే ఇప్పడు తన గురించి మాట్లాడుతున్నారని చిరంజీవి విమర్శించారు. రోజా మంత్రి అయిన తర్వాత తన ఇంటికి కూడా వచ్చారని, ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా మాట్లాడిందో ఆమెనే అడగాలని చెప్పారు. తాను ఎవరికీ సహాయం చేయలేదని అంటున్నారని, తన గురించి తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ప్రశాంతతే తనకు ముఖ్యమని, అందుకే ఎవరి గురించి తాను తిరిగి మాట్లాడనని చెప్పారు.