హైదరాబాద్ కు చేరుకున్న మాణిక్ రావు ఠాక్రే

హైదరాబాద్ కు చేరుకున్న మాణిక్ రావు ఠాక్రే

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాణిక్ రావు ఠాక్రేకు టీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రెండ్రోజుల పాటు హైదరాబాద్ లోనే పర్యటించనున్న మాణిక్ రావు ఠాక్రే కాంగ్రెస్ నేతలతో వేర్వేరుగా భేటీకానున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ కు చేరుకున్న మాణిక్ రావు ఠాక్రే ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. గాంధీభవన్ కు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే బయటే కలుస్తానని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాణిక్ రావు ఠాక్రేకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాసేపల్లో ఏఐసీసీ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ తో భేటీకానున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ నేత భట్టితో మాణిక్ రావు ఠాక్రే సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గం.లకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 టలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం, సాయంత్రం 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ఇక రేపు ఉదయం గురువారం 10.30 కు డీసీసీ అధ్యక్షులతో మాణిక్ రావు ఠాక్రే సమావేశంకానున్నారు. ఆ తర్వాత అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ, పార్టీలోని వివిధ సెల్స్ , డిపార్ట్మెంట్ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 4 గం.లకు మాణిక్ రావు ఠాక్రే తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.