జూన్ లో నీట్ 2022.. వచ్చే వారంలో ప్రకటన..!

జూన్ లో నీట్ 2022.. వచ్చే వారంలో ప్రకటన..!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)-2022 ఈ ఏడాది జూన్ లోజరిగే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీఏ) సన్నాహాలు చేస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్ ప్రభావంతో నీట్ నిర్వహణ ఆలస్యమవుతూ వస్తోంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకూ రెండో విడత ప్రవేశ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీనిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా నిర్ణీత సమయానికి నీట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి.