ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రేపు సెలవు

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రేపు సెలవు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు ( మహిళా ఉద్యోగులకు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ సంవత్సరం మహిళా దినోత్సవం నాడు సెలవు ఇస్తున్నట్లుగానే ఈ సారి కూడా ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.