ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం

ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదంహైదరాబాద్ : రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న 6 మంది యువకులు మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కారులో మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. మితి మీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు ముందు సీటులో ఇరుకున్న యువతిని చాలా కష్టం మీద ఓఆర్ఆర్ సిబ్బంది బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 13N 5121 గా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు యువకులు , ఒక యువతి వున్నట్లు తెలిపారు. డ్రైవర్ ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవి గా గుర్తించారు.