ఇంగ్లండ్ ఆలౌట్..యాషెస్ ట్రోఫీ ఆస్ట్రేలియా

ఇంగ్లండ్ ఆలౌట్..యాషెస్ ట్రోఫీ ఆస్ట్రేలియామెల్ బోర్న్: ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా నిలుపుకున్నది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆసిస్, ఇంగ్లండ్ ను మట్టికరిపించింది. ఇప్పటికే 0-2 తో వెనుకబడిన ఈ జట్టు మూడో టెస్టులోనూ తడబడుతోంది. ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్ లో 65.1 ఓవర్లలో 185 పరుగులకు కుప్పకూలింది.

కెప్టెన్ జో రూట్ (50), బెయిర్ స్టో (35) మాత్రమే రాణించారు. పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకున్న కమిన్స్, లియాన్ లకు 3, స్టార్క్ కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆసీస్ ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్ లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. వార్నర్ (38) అవుట్ కాగా, క్రీజులో హారిస్ (20), లియాన్ (0) ఉన్నారు.