భారత్ లో కొత్తగా 6358 కరోనా, 653 ఒమిక్రాన్ కేసులు

భారత్ లో కొత్తగా 6358 కరోనా, 653 ఒమిక్రాన్ కేసులున్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691 కి పెరిగింది. ఇందులో 3,42,43,945 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 4,80,290 మంది మరణించారు. మరో 75,456 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో మరో 293 మంది మరణించగా, 6450 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.40 శాతం, పాజిటివిటీ రేటు 0.64 శాతంగా ఉందని తెల్పింది.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 653 కు చేరాయని ప్రకటించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 46 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఐతే ఇప్పటివరకు 186 మంది బాధితులు కరోనా కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారని తెలిపింది.