నటి శోభనకు ఒమిక్రాన్ పాజిటివ్

నటి శోభనకు ఒమిక్రాన్ పాజిటివ్హైదరాబాద్ : ప్రముఖ నటి, క్లాసికల్ డ్యాన్సర్ శోభన కరోనా బారినపడ్డారు. తనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ప్రకటించింది. ప్రపంచం అద్భుతంగా నిద్రపోతున్న వేళ నాకు ఒమిక్రాన్ సోకిందని శోభన అన్నారు. నాకు ఒమిక్రాన్ సోకిందని, కీళ్ల నొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయని.

అయితే ప్రస్తుతం రోజురోజుకూ లక్షణాల తీవ్రత తగ్గిందని తన ఫేస్ బుక్ పేజీలో తెలిపారు. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని, ఇది నా వ్యాధిని 80 శాతం నిరోధించిందంటూ శోభన తన ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యానించారు.

ఇటీవల తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన వారిలో మహేష్ బాబు, త్రిష, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సత్యరాజ్, ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ ఉన్నారు.