ఎనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి, పత్తి

వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల సెలవుల అనంతరం సోమవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో మార్కెట్ కు మిర్చి , పత్తి పోటెత్తింది. సుమారు 25వేల పై చిలుకు బస్తాల మిర్చి మార్కెట్ కు వచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే వండర్ హాట్ కిన్ ధర రూ.19000, తేజ రూ.15600, 341 రకంకి రూ.16000ల ధర నమోదైనట్లు మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.