ఏపీలో మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్

ఏపీలో మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 165 ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రిటైర్మెంట్ ఏజ్ ని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.

దీనిపై ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, టి.కల్పలతారెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, అధ్యక్షుడు కె.శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.