చలి తీవ్రత పెరిగే అవకాశం: వాతావరణశాఖ

చలి తీవ్రత పెరిగే అవకాశం: వాతావరణశాఖహైదరాబాద్‌ : తెలంగాణలో చలి తీవ్రరూపం దాల్చుతోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిక్కుల నుంచి వీస్తున్న శీతల గాలుల వల్లే చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాగల రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్నం తెలిపారు. ఈనెల 27 నుంచి 30 వరకు ఉత్తర, ఈశాన్య జిల్లాలతో పాటు అటవీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.