కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశం

కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశంహైదరాబాద్ : ఆర్జేడీ నాయకులు, బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ మంగళవారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతిభవన్ లో తేజస్వి యాదవ్ కు సీఎం కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై తేజస్వి యాదవ్ తో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. కేసీఆర్ తో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు శనివారం ప్రగతిభవన్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో జాతీయ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. నేడు తేజస్వి యాదవ్ తో సమావేశమై జాతీయ రాజకీయాలపై ఆయన చర్చించారు.