అగ్గిపెట్టెలో చీర, నేతన్నకు టీ మంత్రుల ప్రశంసలు

అగ్గిపెట్టెలో చీర, నేతన్నకు టీ మంత్రుల ప్రశంసలుహైదరాబాద్ : అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేత కార్మికుడు నల్ల విజయ్ ను తెలంగాణ మంత్రులు అభినందించారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ల సమక్షంలో నేత కార్మికుడు విజయ్ తన కుటుంబసభ్యులతో కలిసి చీరను ప్రదర్శన చేశారు. దీనిని ఆసక్తిగా తిలకించిన మంత్రులు చీర వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. విజయ్ పై ప్రశంసలజల్లు కురిపించారు. నేతన్న నైపుణ్యాన్ని కొనియాడిన మంత్రులు, అతని భవిష్యత్తు ప్రయత్నాలకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని చెప్పారు.అగ్గిపెట్టెలో చీర, నేతన్నకు టీ మంత్రుల ప్రశంసలుఈ చీరను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందచేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల నేతరంగంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. విజయ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. సిరిసిల్ల నేత కార్మికులు ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు మరలుతున్నారని నేత కార్మికుడు విజయ్ తెలిపారు. ఇప్పుడు తారను నేసిన చీర 3 రోజుల్లో మరమగ్గాలతో నేయవచ్చని, చేతితో నేయాలంటే రెండు వారాలు పడుతుందని విజయ్ పేర్కొన్నారు. తన కొత్త యూనిట్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ రావాలని నేత కార్మికుడు విజయ్ కోరగా, దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.