తప్పు ఒప్పుకున్న హెయిర్ స్టైలర్ జావేద్ హబీబ్

తప్పు ఒప్పుకున్న హెయిర్ స్టైలర్ జావేద్ హబీబ్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఓ మహిళ జుట్టుపై ఉమ్మివేసిన ఘటనలో ప్రముఖ హెయిర్ స్టైలర్ జావేద్ హబీబ్ మంగళవారం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు.తప్పు ఒప్పుకున్న హెయిర్ స్టైలర్ జావేద్ హబీబ్మరోసారి ఇలాంటి తప్పును పునరావృతం కానివ్వనని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. తానెవ్వరినీ కించపరచాలని అలా చేయలేదని కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన ఓ సెమినార్ లో ప్రముఖ హెయిర్ స్టైలిషర్ జావెద్ హబీబ్ ఓ మహిళకు కేశాలంకరణ చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె జుట్టుపై హబీబ్ ఉమ్మి వేశాడు.

నీటిని వేస్తే జుట్టును అందుకోవడం కష్టమని, ఉమ్మివేస్తే జుట్టును అందుకోవడం తేలిక అని విచిత్ర సమాధానం చెప్పాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సభ్య సమాజం ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. వివాదం ముదరడంతో తాను చేసిన పనికి జావెద్ హబీబ్ క్షమాపణలు చెప్పారు.