సోము వీర్రాజుకు మతిభ్రమించిందన్న రామకృష్ణ

సోము వీర్రాజుకు మతిభ్రమించిందన్న రామకృష్ణకడప జిల్లా : కడప జిల్లా ప్రజలను ఖూనీకోర్లుగా చిత్రీకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. హత్యలు చేసుకునే కడప జిల్లా ప్రజలకు ఎయిర్పోర్ట్ ఎందుకని అనుచిత వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజుకు మతిభ్రమించిందని మండిపడ్డారు. ఆరేడు దశాబ్దాల క్రితమే కడపలో ఎయిర్ పోర్ట్ ఉందన్న విషయం వీర్రాజుకు తెలియదా అని రామకృష్ణ ఎద్దేవా చేశారు. అనుచిత వ్యాఖ్యలతో, మత రాజకీయాలతో లబ్ధి పొందేందుకు ఏపీలో బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. సోము వీర్రాజు ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.