సినిమా డెస్క్ : నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇందులో పూర్తిగా కొత్తగా మారిపోయారు నవదీప్. ఈ సినిమాతో నవదీప్ 2.0 గా కనిపించనున్నారు. జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా లవ్ మౌళి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
నటీనటులు:
నవదీప్, ఫంకూరీ గిద్వానీ తదితరులు
టెక్నికల్ టీమ్:
డిఓపీ, ఎడిటర్, దర్శకుడు: అవనీంద్ర
నిర్మాత: ప్రశాంత్ రెడ్డి తాటికొండ
నిర్మాణ సంస్థ: నైరా క్రియేషన్స్
నిర్మాణ సహకారం – సి స్పేస్
మ్యూజిక్ – గోవింద్
లైన్ ప్రొడ్యూసర్ – దీప్తీ పల్లపోలు
ఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూసర్స్ – ఆనంద్ రాళ్లబండి, పవన్ గోపరాజు, జ్ఞానం తారా మణి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
కొరియోగ్రఫర్: అజయ్ శివశంకర్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
మార్కెటింగ్ – గౌతమ్ పత్తికొండ