విద్యుత్ కోతలతో అంధకారంలోకి ఏపీ : బాబు 

విద్యుత్ కోతలతో అంధకారంలోకి ఏపీ : బాబు

వరంగల్ టైమ్స్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కోతల వల్ల ఎదురువుతున్న ఇబ్బందులను ట్విట్టర్ వేదిక ద్వారా వీడియోను విడుదల చేశారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలు నరకం అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలింతలు, రోగులు పడుతున్న ఇబ్బందులకు సీఎం ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.విద్యుత్ కోతలతో అంధకారంలోకి ఏపీ : బాబు రాష్ట్రంలో చీకట్లకు కారణం ఎవరని ప్రశ్నించారు. పెరిగిన విద్యుత్ బిల్లులను అష్టకష్టాలు పడి ప్రజలు కడుతున్నా ఇంకా విద్యుత్ కోతలెందుకని నిలదీశారు. విద్యుత్ లేక గ్రామగ్రామాన ప్రజలు రోడ్డుకెక్కుతున్నారని ఆయన అన్నారు. వాలంటీర్లకు సన్మానం పేరిట రూ. 233 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. విద్యుత్ కోతలపై ప్రశ్నిస్తే బెదిరించడం మాని సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.