కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఏపీ మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి 2026-2027 పాలసీకి ఆమోదం తెలిపింది. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి కేబినెట్ ఆమోదించింది. డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ , డిగ్రీ కాలేజీల్లో 574 పోస్టుల భర్తీ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ , ఏపీ టూరిజం కార్పొరేషన్ కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది.కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదంరాజమహేంద్రవరంలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కు స్థల ప్రతిపాదన, ఐదు జిల్లాలో ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపుల ప్రతిపాదన, హెల్త్ హబ్ పథకం కింద ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులు, రాజమహేంద్రవరం , కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆస్పత్రులు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో హెల్త్ హబ్ పథకం కింద ఆస్పత్రులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పారిశ్రామిక పార్కుకు 82 ఎకరాల కేటాయింపు, జడ్పీల కాలపరిమితి ముగిసే వరకు కొనసాగించేందుకు చట్ట సవరణల నిర్ణయంపై కూడా మంత్రివర్గంలో చర్చించారు.