భద్రకాళికి లక్ష గులాబీలతో అర్చనలు 

భద్రకాళికి లక్ష గులాబీలతో అర్చనలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. గురువారం మహోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. భద్రకాళికి లక్ష గులాబీలతో అర్చనలు తర్వాత అమ్మవారికి వసంత నవరాత్ర కల్పోక్త ప్రకారం జరుపాల్సిన విశేష పూజారాధనలు జరిపారు. అనంతరం అమ్మవారికి లక్ష పుష్పార్చన దేశీ గులాబీ పూలతో జరిపారు. అనంతరం వివిధములైన భోగములతో మహా నివేదనం జరిపి, నీరాజన మంత్ర పుష్పముల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపినట్లు ఆలయ ఈవో కే.శేషు భారతి తెలిపారు.