వరల్డ్ ఛాంపియన్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్

వరల్డ్ ఛాంపియన్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్మౌంట్ మౌంగనుయి : బంగ్లాదేశ్ అరుదైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల టెస్ట్ క్రికెట్ లో వరల్డ్ ఛాంపియన్ షిప్ ను నెగ్గిన న్యూజిలాండ్ ర్యాకింగ్ లో తొమ్మిదవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. మౌంట్ మంగనుయిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కివీస్ పై బంగ్లాదేశ్ విక్టరీ సాధించింది. కేవలం 40 పరుగుల లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని అందుకున్నది.

16 టెస్టుల తర్వాత న్యూజిలిండ్ తొలిసారి ఓడిపోవడం, అదీ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం అనేది ఓ అద్భుతం. దీంతో 2 టెస్టుల సిరీస్ లో బంగ్లా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. బంగ్లా బౌలర్ ఇబాదత్ హుస్సేన్ తన బౌలింగ్ తో మెరుపులు మెరిపించాడు. రెండవ ఇన్నింగ్స్ లో 46 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడతను. దీంతో న్యూజిలాండ్ తన రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 169 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.