ఎన్ కౌంటర్ లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

ఎన్ కౌంటర్ లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతంశ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.

ఈ సందర్భంగా టెర్రరిస్టులు, గాలింపు బృందాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారిలో ఒకరు పాకిస్థాన్ జాతీయుడని తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధ సామగ్రి, 2ఎం – 4కార్బైన్లు, ఏకే రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.