ఐక్యతను ప్రేమిద్దాం అంటూ కేటీఆర్ సంక్రాంతి విషెష్

ఐక్యతను ప్రేమిద్దాం అంటూ కేటీఆర్ సంక్రాంతి విషెష్హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొందరు వన్ ఇండియా అని అంటున్నారు. భారతదేశమంతా ఒకటిగా ఉండాలని నేను చెప్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. మన గొప్ప సంప్రదాయాలన్నింటిలో ఏకత్వాన్ని ఆస్వాదిద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. విచ్ఛిన్నం చేసే వాటిని కాదు, మనల్ని ఐక్యం చేసే వాటిని ప్రేమిద్దాం అని మంత్రి కేటీఆర్ కోరుతూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.